ఆగస్టు 15న ‘నిరసన దినం’ పాటించాలి: పాక్‌

పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ

Pakistan
Pakistan

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీరులో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిరసనగా ఆగస్టు 15.. భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, నివాస ప్రాంతాలలో పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 14న కశ్మీరీ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికార హక్కు కోసం జరుపుతున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/