ఒకే జట్టుపై ఏడు అర్ధశతకాలు, వార్నర్‌ రికార్డు

david warner
david warner


మొహాలీ: సన్‌రైజర్స్‌కు, పంజాబ్‌ జట్టకు నిన్న జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ రికార్డు సాధించాడు. సోమవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ అర్ధశతకం బాది, పంజాబ్‌పై వరుసగా ఏడు అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో పంజాబ్‌ జట్టుపై ఆడిన మ్యాచ్‌ల్లో వరుసగా 58, 81, 59, 52, 70, 51, 70 పరుగులు చేశాడు. వరుసగా రెండు జట్లపై ఏడు అర్ధశతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా వార్నర్‌ నిలిచాడు. ఈ ఐపిఎల్‌లో వార్నర్‌ ఆరు మ్యాచుల్లో 349 పరుగులు చేసి, ఆరెంజ్‌ క్యాప్‌ విజేతగా కొనసాగుతున్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/