బ్యాటింగ్, బౌలింగ్‌లో అశ్విన్ తనకు తానే సాటి

మొహాలి: బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అశ్విన్ తనకు తానే సాటి. అశ్విన్ జట్టుకు ఎంతో బల తీసుకొచ్చాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అన్నాడు. మంగళవారం జరిగిన మ్యాచులోపంజాబ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మిల్లర్ మాట్లాడుతూ..ఆ జట్టు సారథి రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను సైతం అశ్విన్ తన బౌలింగ్‌తో పెవిలియన్‌కు పంపిస్తాడని అన్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో అశ్విన్ సమర్ధుడు. అశ్విన్ జట్టుకు పెద్ద బలం అని డేవిడ్ మిల్లర్ అన్నాడు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/