ఫెడరల్ ఫ్రంట్ ఓ అతుకుల బోంత

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఈరోజు మీడియాతో మాట్లాడుతు తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రధాని అభ్యర్థిగా ఎవరూ గుర్తించరని ఆయన అన్నారు. రూ.30 వేల కోట్లు గ్రాంటూగా ఇచ్చిందని ఇచ్చిన నిధుల అంశంపై లెక్కలతో సహ ఏ చౌరస్తాలోనైనా చర్చించేందుకు బిజెపి సిద్దంగా ఉందని దత్తాత్రేయ అన్నారు. ప్రధాని మోడిపై కెసిఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, అందుకు ఆయన భారత దేశ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోజురోజుకీ బిజెపి గ్రాఫ్ పెరుగుతోందని, టీఆర్ఎస్ తెరాస గ్రాఫ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు.
కెసిఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఓ అతుకుల బొంత అన్నారు. దేశంలో బిజెపి 300 సీట్లు గెలిస్తే కెసిఆర్ , కెటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాల్ విసిరారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/