జోరుగా సాగుతున్న ఖర్జూ అమ్మకాలు

dates
dates

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రంజాన్‌ మాసం కారణంగా ఖర్జూర పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే జాన్ ఉపవాస దీక్షలలో ముస్లింలు సాంప్రదాయఫలంగా భావించే ఖర్జూర పండ్ల విక్రయాలు హైదరాబాద్ లో జోరుగా సాగుతున్నాయి. రంజాన్‌లో ప్రతి ముస్లిం మొదటగా కొనుగోలు చేసేది ఖర్జూర పండ్లనే. ముస్లింలు రంజాన్ ఉపవాసాలను ఖర్జూర పండుతోనే విరమిస్తారు కాబట్టి ఖర్జూరాలకున్న డిమాండ్ దృష్ట్యా హైదరాబాద్ లో కొంత మంది వ్యాపారులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. మరికొంత మంది కేవలం రంజాన్ మాసంలోనే ఖర్జూర పండ్ల వ్యాపారం చేస్తుంటారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద కర్జూరా పండ్ల దుకాణాలే దర్శనమిస్తున్నాయి.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/