సాహితీవేత్త తిరునగరికి దాశరథి పురస్కారం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ మహాకవి దాశరథి కృష్ణమాచార్య2020 సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అంద‌జేశారు. అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక‌ను అంద‌జేసి శాలువాతో రామానుజ‌య్య‌ను సిఎం సత్కరించారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ..దాశరధి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సిఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షర ధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాషా పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని సిఎం అభినందించారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/