‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 22 న విడుదల చేయబోతున్నారు. క్లాస్ తో పాటు మాస్ అవతారాన్ని చూపించేందుకు విశ్వక్ తెగ ఆతృతగా వేచి చూస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో అన్నీ విశ్వక్ సేన్ యే.

వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ నిర్మించిన ఈ బహుభాషా చిత్రంలో రావు రమేష్ రోహిణి మొల్లేటి అజయ్ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన మూడు పాటలు విడుదల కాగా.. ఈ మూడు పాటలూ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. రామ్ మిరియాల మావా బ్రో పాటను అందించారు.