దాస్ కా ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఉగాది కానుకగా మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ , సాంగ్స్ తో ఆకట్టుకోవడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పరుగులు పెట్టారు. దీంతో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నైజాంలో రూ.91 లక్షలు సీడెడ్ లో రూ.46 లక్షలు అమెరికాలో రూ.40 లక్షలు తూర్పులో రూ.30 లక్షలు పశ్చిమ రూ.20 లక్షలు గుంటూరు రూ.40 లక్షలు కృష్ణా రూ.25 లక్షలు నెల్లూరులో రూ.17 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం రూ.3.06 కోట్ల రూపాయలను వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక రెస్టాఫ్ ఇండియా కలుపుకొని రూ.40 లక్షలు, ఓవర్సీస్ లో రూ.62 లక్షలు వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.4.08 కోట్ల షేర్ వసూళ్లును రాబట్టింది. రూ.8.20 గ్రాస్ వసూళ్లను సాధించింది.