భీమ్లా నాయక్ నుండి రానా ప్రీ లుక్ వచ్చేసింది

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ భీమ్లా నాయక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ప్రమోషన్ ను స్పీడ్ చేస్తూ సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా..ఈరోజు రానా ప్రీ లుక్‌ రిలీజ్‌ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో డానియల్‌ శేఖర్‌ పాత్రలో రానా నటిస్తున్నట్లు… చిత్ర బృందం ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఇక డానియల్‌ శేఖర్‌ పూర్తి లుక్‌ ను… సెప్టెంబర్‌ 20 విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం అయ్యప్పనమ్ కోషీయమ్ తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.