డాన్స్‌ థెరపీతో రుగ్మతలకు చెక్‌

DANCEFOR HEALTH
DANCEFOR HEALTH

డాన్స్‌ థెరపీతో రుగ్మతలకు చెక్‌

నేటి మానవుడు తనకు తాను నియంత్రించుకున్న విధివిధానంలో నడవక ఇటువంటి మహత్తర శరీరం గురించి పట్టించుకోక, తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు. నేటి కాలంలో మానవ జీవితం అర్ధరహితమైపోతున్నది. చాలా మంది ‘ఆరోగ్యమే మహా భాగ్యం అనే సూత్రాన్ని ప్రక్కనపెట్టి ‘ధన మూలమిదం జగత్‌ అనే సూత్రం ప్రకారం ఉదయం లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకూ ధనార్జనపై మనస్సు లగ్నం చేసి శరీరంలో జరిగే మార్పులను కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మానవ శరీరం ఒక అద్భుతం. ఇది నిరతంతరం పని చేసే మహా యంత్రం. ఈ మహాయంత్రంలో మెదడు ఒక ముఖ్యమైన పాత్ర వహి స్తుంది.

నిరంతరం అలసిపోయే సమయంలో మన శరీరాన్ని నియం త్రించే చికిత్స పొందితే తిరిగి కొత్త శక్తిని పొంది వారివారి పనులను రెట్టింపు ఉత్సాహంతో, ఆనందంతో తమ పనులను చేయగల శక్తిని కలిగి ఉంటారు. మానవ శరీరానికి కలిగే పలు రకాల రుగ్మతలను సరిదిద్దే వ్యవస్థ అంతర్గతంగా ఉంటుంది. అయితే మానవ్ఞలు తమ అలవాట్లు, పద్ధ తులతో తమకు తాము అంతర్గత వ్యవస్థను దెబ్బ తీసుకుని, శరీరాని కి అవసరమైన శక్తిని సక్రమంగా అందించకపోవడం మొదటి పొరపాటు. అనారోగ్యమనేది నేటి కాలంలో ఒక సవాల్‌. దాని మీద సవారి చేసి విజయం సాధించడమనేది మరొక సవాల్‌. ఈ 21వ శతాబ్దంలో శారీరక మానసిక ఒత్తిళ్లను తప్పించుకోలేని పరిస్థితులు అనేకం. శారీరక, మానసిక ఒత్తిళ్లు శారీరక అంతర్గత వ్యవస్థను దెబ్బ తీసి, లు రకాల జబ్బు లకు దారి తీస్తుంది.

ఉదాహర ణకు కంటికి సంబంధించిన వ్యాధులు, తల, నడుము, కీళ్లు, అధిక రక్త పోటు మొదలైనవి. ఇటువంటి సమస్యలను దూరం చేయగల శక్తి కలిగిన ప్రక్రియ – నాట్య చికిత్స. ఆధుని కులకు ఇది ఒక నూత న ప్రక్రియ. కాని మన పూర్వీకులు ఈ నాట్య చికిత్సా విధానాన్ని అవలంబిస్తూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటూ జీవనం సాగించే వారు. నాట్యం ఒక కళ అని అంద రికీ తెలుసు. కాని యోగా మాదిరిగా నాట్యం కూడా ఒక చికిత్సావిధానమని కొందరికే తెలు సు. మన శాస్త్రీయ, దేశీయ నృత్యాల లోని లాస్య తాండవ విన్యాసాలే ఈ పవిత్ర నాట్య చికిత్సా విధానానికి పునాదులు. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం నాట్యానికి ఒక ప్రామాణిక గ్రంథం రచించి ప్రజలకు అందించారు భరతముని. అదే మన నాట్యశాస్త్రం. భరతముని రచించిన నాట్యశాస్త్రం మొత్తం 36 అధ్యాయాలుగా విభజించారు. ఇందులో అతి ముఖ్యమైన అధ్యాయం, నాట్య చికిత్సకు పునాదులు ఉన్నది – ఆంగికా భినయం. యతోహస్త స్థతో దృష్ట్ఖిః – యతోదృష్టి స్థతో మనః యతోమనః స్థతో భావః- యతోభావ స్థతో రస! – చేతి కదలికపై దృష్టిని నిలిపి మనస్సును లగ్నం చేస్తే భావం కలుగుతుంది. ఈ భావంతో రసోత్పత్తి కలుగుతుంది. చేతి కదలికలు లేదా శారీరక కదలికలు ఒక వ్యాయామం వంటివి.

ఈ వ్యాయామంపై దృష్టిని కేంద్రీకరి్త మన అంతర్గత వ్యవస్థ కుదుటపడుతుంది. ఈ అంతర్గత వ్యవస్థ మనస్సును మెరుగుపరుస్తుంది. మెరుగుపడిన అంతర్గత వ్యవస్థ శరీరన్ని బాగు చేస్తుంది. శరీరంలోని అంతర్గత వ్యవస్థ పని తీరును మెరుగుపరిచే శక్తి మన నృత్యాలకు ఉంది. నాట్య చికిత్సను ఇంగ్లీషులో డాన్స్‌ థెరపీ అంటాము. ఈ చికిత్స ద్వారా మనకు ఉన్న శారీరక రుగ్మతలను నయం చేసుకోవచ్చు. మన ఉన్న అంతర్శక్తిని మనం మరచిపోతున్నాం. యాంత్రిక శక్తిపై ఆధార పడుతూ, శరీరం శక్తిని విస్మరిస్తూ శరీరం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. ఇది చాలా ప్రమాదకరం.

ఈ స్థితినుంచి శరీరానికి సరైన మార్గాన్ని చూపించి కొత్త శక్తిని ప్రసాదిస్తుంది. నాట్య చికిత్స ద్వారా మనిషిలో తెలియని ఉత్సాహం ఏర్పడు తుంది. శారీరక అలసటను తీర్చి మనస్సును కుదుటపరుస్తూ మంచి విశ్రాంతిని ఇస్తుంది. శరీర సౌష్ఠవం క్రమ బద్ధీ కరించబడుతుంది. ఎముకలు, కండ రాలు గట్టిపడ తాయి. గుండె పని తీరును మెరుగుపరిచి గుండె పోటు, మధు మేహం, స్థూలకాయం వంటి రుగ్మతలను నివారి స్తుంది. మెదడులోని ఎండార్ఫిన్స్‌ అనే హార్మోన్లు స్రవించి, శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. శారీరక ప్రక్రియను క్రమబద్ధీకరించి ఊపిరితిత్తులు, గుండె రక్తాన్ని పంపే ప్రక్రియను పెంచి రక్తపోటు రాకుండా, ఊపిరి తిత్తుల వ్యాధులు రాకుండా చేస్తుంది. స్త్రీలలో రుతుక్రమంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. బహి ష్టులాగిపోయే దశలో వచ్చే ఇక్కట్లను నివారిస్తుంది. ఎదిగే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.