తెలంగాణలో టీడీపీ జీరో

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పై నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యంగ్యస్త్రాలు సంధిచారు.ఎంపీగా పొటీ చేసేందుకు కాంగ్రెస్‌ నుంచి ఎవరూ ముందుకు రావడంలేదని విమర్శించారు.సికింద్రాబాద్‌ పార్లమెంట్‌కు పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్థేలేరని ఎద్దేవాచేశారు.ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ లో బీజేపీకి క్యాడరే లేరన్నారు.తెలంగాణ లో టీడీపీ పరిస్థితి జీరో అని చెప్పారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో మైనార్టీల ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌కేనని స్పష్టం చేశారు.