రావణ దహనకాండలో దానం నాగేందర్‌, ఎంఎల్‌సి ఎంఎస్‌ ప్రభాకర్‌లు

danam nagender
danam nagender

ఖైరతాబాద్‌: ప్రభాతవార్త: చింతల్‌ బస్తీ రాంలీలా మైదానంలో దసరా సమ్మేళన్‌ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహనకాండ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మండలివిప్‌, ఎంఎల్‌సి ఎంఎస్‌ ప్రభాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కకుటుంభం సుఖసంతోషాలతో ఉండాలని, చెడుపై మంచి సాధించేది దసరా పండగ అని వ్యాఖ్యానించారు. ప్రజల జీవితంలో వెలుగులునింపాలని దానం ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతుకు ముందు వివిధ రకాలకు చెందిన భారీ బాణసంచాలు (టపాసులు) రాకెట్‌లను అభిమానులు పేల్చారు. గతంలో మాదిరిగానే వేషదారణలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా దానం, ప్రభాకర్‌ ప్రభృతులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/telengana/