వర్షాకాలం ఇబ్బందులకు మాన్‌సూన్‌ బృందాల ఏర్పాటు

dana kishore
dana kishore, GHMC commissioner

హైదరాబాద్‌: వానాకాలం నగరంలో ఎన్ని ఇబ్బందులుంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు జిహెచ్‌ఎంసి సరికొత్త కార్యాచరణ రూపొందించింది. మాన్‌సూన్‌ బృందాలను ఏర్పాటు చేసి, ప్రాంతాల వారీగా సీనియర్‌ అధికారులు. అసిస్టెంట్‌ ఇంజనీర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. మోటార్లు ఏర్పాటు చేసి వరద నీరు తొలగించడం..ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచేలా కొలనులు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. వాతావరణ శాఖ సూచనల మేనకు వర్షం కురిసే గంట ముందే సీనియర్‌ అధికారులు, సిబ్బంది నిర్ణీత ప్రాంతాలకు చేరుకుని వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చేయనున్నారు. జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిశోర్‌ వరుస వర్షాల నేపథ్యంలో జోనల్‌, డిప్యూటి, అదనపు కమీషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/