ప్రజాకూటమికి నష్టం జరిగింది: కేటీఆర్

ktr
ktr

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పొత్తు వల్ల ప్రజాకూటమికి నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నేతలు, ఎన్నికల ప్రచారం చివరి రెండు రోజుల్లో చంద్రబాబు ఫొటో లేకుండానే తిరిగారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు అపవిత్రమైందని, ఈ ఎన్నికల్లో విజయం కోసం కూటమి నేతలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈవీఎంల పనితీరు గురించి తమకు ఎలాంటి సందేహాలు లేవని, ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.