భారత్‌లో స్వేచ్ఛగా ఉన్నా: దలైలామా

dalai lama
dalai lama

న్యూఢిల్లీ: శరణార్ధిగా వచ్చినా భారత్‌లో స్వేచ్ఛగా ఉన్నానని బౌద్ధమతగురువు దలైలామా అన్నారు. చైనా బహిష్కరణతో 60 ఏళ్ల క్రితమే టిబెట్‌ నుండి శరణార్ధిగా భారత్‌కు వచ్చినప్పటికి ఇక్కడ స్వేచ్ఛగా జీవిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా ఆధీంలో ఉన్న టిబెట్‌కి స్వేచ్ఛ కల్పించే అంశంపై ఒకప్పుడు మాజీ ప్రధాని నెహ్రూతో ప్రస్తావించగా.. ఐక్యరాజ్యసమితి అన్నీ చేయగలదని అనుకోవద్దని ఆయన చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. టిబెట్‌కు స్వాతంత్య్రంపై చైనా పాలకులతోనే చర్చలు జరపడం మంచిదని నెహ్రూ సూచించిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. 1974లో అప్పటివరకూ టిబెట్‌ స్వాంతత్య్రం కోసం పోరాడిన తాము ఇక పోరాటాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు దలైలామా వివరించారు. చైనాతో ఉంటూ తమ సంస్కృతిని కాపాడుకునేందుకు కొన్ని హక్కులు తమకు ఇవ్వాలని కోరాలనుకున్నట్లు తెలిపారు. 2001 నుంచి తాను రిటైరయ్యానన్న దలైలామా ఎన్నికైక రాజకీయ నేతలు.. బాధ్యతలు నిర్వహిస్తున్నారని ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చైనా పాలకులకు నేర్పగలమని దలైలామా వ్యాఖ్యానించారు. చైనా ఆధీనంలోని టిబెట్‌ ప్రభుత్వం అక్టోబరు 6న ఓ తీర్మానం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం తన వారసుడు ఎవరన్నది దలైలామానే నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో ఏ దేశమూ జోక్యం చేసుకోదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/