గడ్డకట్టుకుపోయిన దాల్‌ సరస్సు

ద్రాస్‌లో మైనస్ 28.7 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత

Dal Lake
Dal Lake


ద్రాస్‌ : చలితో ఉత్తర భారతదేశం గడ్డకట్టుకుపోతోంది. జమ్మూ, కశ్మీర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6.2 డిగ్రీలకు పడిపోగా, ద్రాస్‌లో ఏకంగా మైనస్ 28.7 డిగ్రీలకు పడిపోయింది. దాల్ సరస్సు అయితే ఏకంగా గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటక బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. చలి నుంచి రక్షణ కోసం ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. కాగా చలిగాలుల తీవ్రత పెరగడంతో హరియాణా ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. వెలుతురు మందగించడంతో ఢిల్లీలోని పలు విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/