ఇకపై శబరిమలలో రోజుకు 60 వేల మంది భక్తులకు అనుమతి

కేరళ : శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త చెప్పింది ట్రావెన్ కోర్ బోర్డు. ప్రస్తుతం స్వామి దర్శనం కోసం పరిమితిని భారీగా పెంచింది. రోజుకు 60 వేల మందిని అనుమతిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో 2 వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 3 వేల మందిని అనుమతించనున్నారు. ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) ఆదివారం కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచినట్లు తెలిపింది. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు దేవస్వం మంత్రి కార్యాలయం తెలియజేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘నెయ్యభిషేకం’ (నెయ్యితో అభిషేకం) చేసేందుకు భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/