దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

సూపర్ స్టార్ రజినీకాంత్కు ప్రకటిస్తూ కేంద్ర మంత్రి వెల్లడి

Dadasaheb Phalke Award for Rajinikanth
Dadasaheb Phalke Award for Rajinikanth

New Delhi: దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని దక్షిణాది అగ్ర నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కు గురువారం ప్రకటించారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. 2019 సంవత్సరం కి గాను ఇండియన్ సినిమా హిస్టరీలో గ్రేటెస్ట్ నటుల్లో ఒకరైన రజినీకు ఈ పురస్కారాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

జ్యూరీ సభ్యులు అయినటువంటి ఆశా భొశ్లే, సుభాష్ తదితరులకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ధన్యవాదాలు తెలిపారు. రజినీకు ఈ అత్యున్నత పురస్కారం రావడంతో అభిమానులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజినీ కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ ను ఈ పురస్కారం వరించింది. అలాగే దక్షిణాదికి చెందిన బొమ్మరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు) ఎల్వీ ప్రసాద్ (తెలుగు) నాగిరెడ్డి (తెలుగు) అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు) శివాజీ గణేషన్ (తమిళం రాజ్ కుమార్ (కన్నడ) గోపాలకృష్ణన్ (మలయాళం) రామానాయుడు (తెలుగు) బాలచందర్ (తెలుగు తమిళం) కేవిశ్వనాథ్ (తెలుగు) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/