దబాంగ్‌ ఢిల్లీ విజయం

DABANG-D
DABANG-D

దబాంగ్‌ ఢిల్లీ విజయం

న్యూ ఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ అదరగొట్గగా జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 48-35తో జైపూర్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ రైడర్లు మీరాజ్‌ షేక్‌ (15), నవీన్‌ కుమార్‌ (9) పోటాపోటీగా పాయింట్లు సాధించారు. మీరాజ్‌ దెబ్బకు ఢిల్లీ తొలి అర్ధబాగం ముగిసేసరికి 29-10తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగంలో జైపూర్‌ పుంజుకొని ఢిల్లీ ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. కానీ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. ఇక ఉత్కంఠగా సాగిన తమిళ తలైవాన్‌-పట్నా పైరేట్స్‌ మ్యాచ్‌ 35-35స్కోరుతో డ్రాగా ముగిసింది. టెన్నిస్‌లోనూ సత్తా చాటిన ఎంఎస్‌ ధోనీ రాంచీ : టీం ఇండియా కెప్టెన్‌గా, క్రికెటర్‌గా మహేంద్రసింగ దోనీ ఎన్నో అరుదైన రికార్డులను సా ధించాడు. అయితే ప్రస్తుతం మాత్రం ధోనీ తన ఫాం కారణంగా విమర్శలు ఎదురుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బిసిసిఐ విండిస్‌తో జరిగిన టీ20 సిరీస ్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో దోనీకి జట్టులో చో టు కల్పించలేదు. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు సృ ష్టించిన ధోనీ.. టెన్నీస్‌లోనూ సత్తా చటాడు. రాంచీ లోని జెఎస్‌సిఎ కంట్రీ క్లబ్‌ టెన్నీస్‌ టోర్నమెంట్‌ ధోనీ విజయం సాధించి.. టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్‌ కేటగిరిలో ధోనీ స్థానిక టెన్నీస్‌ క్రీడాకారుడితో కలిసి ఆడిన ధోనీ ఫైనల్‌ మ్యాచ్‌లో 6-3, 6-3 తేడాతో విజయం సాధించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు ఈ సందర్భంగా ధోనీని మెచ్చుకుంటూ.. అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.