ఢిల్లీ వెళ్లిన డికే అరుణ

D. K. Aruna
D. K. Aruna

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి నాయకురాలు డికే అరుణ న్యూఢిల్లీ వెళ్లారు. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి రేసులో ఆమె ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు రోజులపాటు ఆమె ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి, బిజెపి జతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఇంకా పలువురు బిజెపి పెద్దలను ఆమె కలవనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామలపై ఆమె బిజెపి అగ్ర నాయకులతో చర్చించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/