తమిళనాడులో కుంభవృష్టి

cyclone at tamilnadu
cyclone at tamilnadu

ఏడుజిల్లాల్లో విద్యుత్‌సరఫరా నిలిపివేత
బస్సుసర్వీసులు రద్దు, రైళ్ల రద్దు, మరికొన్ని రూటు మార్పిడి
నాగపట్టణం మీదుగా తీరందాటే అవకాశం
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు
కోస్తా ఆంధ్ర నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోను గజ తుపాను ప్రభావం
చెన్నై: గాజా తుపాను తీవ్రత మరింత పెరగడంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు విద్యుత్‌సరఫరాను కూడా నిలిపివేసారు. తమిళనాడు తీరంవెంబడి ప్రాంతాల్లో భారీ కుంభవృష్టి వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళా ఖాతంలో 285 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతం అయి ఉంది. అలాగే పుదుచ్చేరిలోని కరైకాల్‌కు 225 కిలోమీటర్లు తూర్పుప్రాంతంలోకేంద్రీకృతం అయిందని, మరింతగా ఉధృతం అయి కడలూరు పంబన్‌, నాగపట్టణం మీదుగా గురువారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా తుపాను ప్రభావం తగ్గుతుందని వాతావరణశాఖ తాజా బులిటెన్‌ వివరించింది. ఈ భీభత్సం సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సుమారు 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఉంటాయని అధికారులు వెల్లడించారు. దక్షిణ తమిళనాడు కోస్తా వెంబడి తీరం దాటుతుందని వాతావరణశాఖప్రకటించింది. రాత్రి ఎనిమిదినుంచి 11 గంటలప్రాంతంలో భారీఎ త్తున ప్రభావంచూపిస్తుందని, నాగపట్టణం జిల్లాకు 300 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయి ఉందని ఉపద్రవ నివారణ శాఖ వెల్లడించింది. గాజా తుపాను కడలూరు, వేదారణ్యం మద్యలో తీరం దాటుతుందని, ఈసమయంలోనే గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాత్రి ఏడు గంటలప్రాంతంలో తూర్పు,నాగపట్టణంఈశాన్యప్రాంతంలో 138 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందనవాతావరణశాఖ అధికారులువెల్లడించారు. తీరప్రాంతప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. నాగఫట్టణం ప్రాంతంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు తుపాను సన్నద్ధ కార్యక్రమాలు ప్రారంభించారు. చెన్నైలోని మెరీనాబీచ్‌లో ఉవ్వెత్తున జలతరంగాలు లేచివస్తుండటంతో సందర్శకులందరూ వెనువెంటనే ఖాళీచేసారు. నాగపట్టణం, రామనాధపురం, తిరువారూరు ప్రాంతాల్లో సుమారు రెండువేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా భారతీదాసన్‌ యూనివర్సిటీ ఈనెల 16వ తేదీ పరీక్షలను వాయిదా వేసింది. మత్స్యకారులను చేపలవేటకు వెళ్లొద్దనిహెచ్‌చ్చరించడంతో పల్లెకారులు తమతమ పడవలను సైతం సురక్షితప్రాంతాలకు తరలించారు. తమిళనాడులోని ఏడు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు సైతం నిలిపివేసారు. గురువారంసాయంత్రం ఆరు గంటలనుంచి శుక్రవారం ఉదయం ఆరుగంటలవరకూ బస్‌సర్వీసులు నిలిచిపోయాయి. కడలూరు, నాగపట్టణం, తంజావూరు, తిరువారూరు ప్రాంతాల్లో బస్సుసర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. నాగపట్టణంలో పదో హెచ్చరికను జారీచేసారు.రామేశ్వరం ప్రాంతంలో కూడా ఎనిమిదవప్రమాద హెచ్చరికను జారీచేసారు. ప్రైవేటు కంపెనీలు, సంస్థలు వారి ఉద్యోగులను ఆఫీసులనుంచి సాయంత్రం నాలుగు గంటలకే వదిలివేయాలని ప్రభుత్వం కోరింది. నాగపట్టణం ఇతర పరిసరజిల్లాల్లో తుపానుప్రభావం కారణంగా ముందుగానే ఉద్యోగులను ఇళ్లకు పంపించివేయాలని ఆదేశించింది. తమిళనాడు సాంకేతిక విద్యాశాఖ డిప్లొమా పరీక్షలను వాయిదావేసింది.ఈనెల 22వ తేదీ జరుగుతాయని వెల్లడించింది. తంజావూరు, పుదుకొట్ట§్‌ులలో శెలవులు ప్రకటించారు. ప్రజలను తుపాను షెల్టర్లలోనికి తరలించారు. విద్యాసంస్థలు అన్నింటికీ ఈ రెండుజిల్లాల్లో శెలవులు ప్రకటించారు. తిరువారూరు జిల్లాలో సైతం శెలవులు ప్రకటించారు. నాగపట్టణం తీర ప్రాంతంలో మొత్తం విద్యుత్‌ సరఫరానునిలిపివేసారు. అలాగే గాజా తుపాను ప్రభావం వల్ల వేలాంకణ్ణి, నాగోర్‌, చెన్నై బీచ్‌లలోనికి సందర్శకులను నిలిపివేసారు. మెరీనా బీచ్‌సైతం మూసివేసారు. నౌకాదళం ఇండియన్‌ కోస్ట్‌గార్డు ముందస్తు చర్యలను చేపట్టింది. ఓఖి తుపాను ప్రమాదంతోముందుగానే అధికారులు ప్రజలను అప్రమత్తంచేసారు. లూబన్‌, తిత్లి వంటివికూడా ఎన్నో అనుభవాలను నేర్పినందున తమిళనాడు అధికారులు ముందస్తుచర్యలు ఇప్పటికే చేపట్టారు. మత్స్యకారులకు స్థానిక భాషల్లోనే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఐసిజి నౌకలు చెన్నైనంచి మండపానికి గురువారంనుంచి ఈనెల18వ తేదీవరకూ తనిఖీ కార్యక్రమాలుచేపడతాయి. ఇక వాణిజ్యనౌకలు సైతం అంతర్జాతీయ భద్రతకింద జలవనరుల భద్రత సమన్వయ కేంద్రం తరపునమత్స్యకారులను ఎట్టిపరిస్థితుల్లోను సముద్రంలోనికి వెళ్లకూడదన్న హెచ్చరికలు జారీచేసారు. చెన్నై, మండపం, కరైకాల్‌, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఏ ఉపద్రవం ఎదురయినా తక్షణమే చర్యలుచేపట్టేందుకు నావికాదళం కూడా సిద్ధం అయింది. ఇప్పటివరకూ 41 వాతావరణ బులిటెన్లను జారీచేసిన వాతావరణ శాఖ ప్రతి అర్ధగంటకు ఒకసారి హెచ్చరికలు జారీచేస్తోంది. వర్షాలకారణంగాకరైకాల్‌ చెన్నై ఎగ్మూర్‌ ఎక్స్‌ప్రెస్‌, వేలాంకిన్ని చెన్నై ఎగ్మూర్‌లింక్‌ ఎక్స్‌ప్రెస్‌, మన్నార్‌గుడి చెన్నై ఎగ్మూరు మన్న§్‌ుఎక్స్‌ప్రెస్‌, తంజావూరు చెన్నై ఎగ్మోర్‌ ఉజావన్‌ ఎక్స్‌ప్రెస్‌,తిరుచిరాపల్లి,తంజావూరు స్పెనషల్‌,వేలాంకణ్ణి, కరైకాల్‌ ప్యాసింజర్‌, కరైకాల్‌ తంజావూర్‌ప్యాసింజర్‌, విల్లుపురం మయిలాదుతురై విల్లుపురం ప్యాసింజర్‌, విల్లుపురం మైలాదుతురై విల్లుపురం ప్యాసింజర్‌లను రద్దుచేసారు. ఎర్నాకుళం కరైకాల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాక్షికంగా రద్దుచేసారు. తిరుచిరాపల్లి కరైకాల్‌ ప్యాసింజర్‌ తిరువారూరు కరైకాల్‌ మద్య రద్దుచేసారు. కరైకాల్‌ తిరుచిరాపల్లి ప్యాసింజర్‌ కరైకాల్‌ తిరువారూర్‌లలో రద్దయింది. కెస్‌ఆర్‌ బెంగళూరు కరైకాల్‌ ప్యాసింజర్‌ మైలాదుతురైకరైకాల్‌ స్టేషన్లమధ్య రద్దుచేసారు. రామేశ్వరం తిరుపతి ఎక్స్‌ఎస్‌ తిరుచిరాపల్లి, వృద్దాచలం విల్లుపరుం, రామేశ్వరంచెన్నె తిరుచిరాలపల్లి, వృద్దాచలం, విల్లుపురం రైళ్లను రూటుమార్చి నడుపుతున్నారు. గాజా తుపానుప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోకూడా ప్రజలను అప్రమత్తంచేసారు. కోస్తా ఆంధ్ర తీరంవెంబడి గాజా ప్రభావం ఉధృతంగా ఉంటుందని అంచనావేస్తున్నారు. రెవెన్యూ అధికారులను తీరప్రాంత మండలాల్లో ఎక్కువ తిప్పారు. కోస్తా మండలాల్లో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దన్న హెచ్చరికలు జారీచేసారు. 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.