వణికిస్తున్న ‘వాయు’

గుజరాత్‌లో వాయు తుఫాను బీభత్సం

cyclone VAYU
cyclone VAYU

గాంధీనగర్‌: గుజరాత్‌లో వాయు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. తీరం దాటే సమయం దగ్గర పడేకొద్దీ ఇది తీవ్రమవుతుంది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో గుజరాత్‌ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. దీంతో గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని సోమనాథ్‌ ఆలయంలో ఉన్న ప్రవేశద్వారం షెడ్‌ పైకప్పు ఎగిరిపోయింది. పోరుబందర్‌లోని చౌపట్టి బీచ్‌ వద్ద, వెరెవల్‌లోని జలేశ్వర్‌ సముద్ర తీరం వద్ద సైతం పరిస్థితి ఇలాగే ఉంది. అమ్రేలి, దివు, జునాగఢ్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, దేవ్‌భూమి ద్వారక, కూచ్‌ జిల్లాల్లో గంటకు 155-165 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ మధ్యాహ్నానానికి గంటకు 180 కి.మీ.ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు ఈ తుఫాను ప్రభావం మహారాష్ట్ర తీర ప్రాంతాలను తాకింది. దీంతో కొంకణి తీరంలో ఉన్న బీచ్‌లకు ఎవరూ వెళ్లకూడదని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని మహిమ్‌ బీచ్‌ వద్ద అలలు ఉగ్రరూపం దాల్చాయి.

VAYU cyclone
VAYU cyclone

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/