అమెరికాలో భారీ వర్ష బీభత్సం

పలు చోట్ల విద్యుత్‌ అంతరాయం

cyclone in USA
cyclone in USA

అట్లాంటా: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలను తుఫాను కుదిపేస్తుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ టెక్సాస్‌ నుంచి అలబామా వరకూ అనేక చోట్ల గాలుల తీవ్రతకు విద్యుత్‌ లైన్ల పైన, భవనాలపై చెట్లు కూలిపడ్డాయి. గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల వల్ల టెక్సాస్‌లోని గ్రీన్‌విల్‌ నగరంలో అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరి పోయాయి. అక్కడ ఉన్న మిసోరి నది పరివాహక ప్రాంతంలో వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒహియోలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో హైవేలపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరదల వల్ల రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. దీంతో ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ మధ్య సర్వీసులు నిలిచిపోయాయి. డెలవేర్‌ నది కూడా ప్రమాద స్థాయికి మించి పొంగి పొర్లుతుంది. దీంతో సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/