ఏపీకి తప్పిన తూఫాన్ గండం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి తూఫాన్ గండం తప్పినట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుందని , ఈ తూఫాన్ కు ‘సిత్రాంగ్’ అని వాతావరణ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ తూఫాన్ ఎఫెక్ట్ ఏపీఫై భారీగా పడనుందని భావించారు. కానీ ఇప్పుడు ఈ తూఫాన్ ముప్పు ఏపీకి తప్పినట్లు తెలిపింది వాతావరణ శాఖ. ఏపీకి బదులు బంగ్లాదేశ్ కు ఈ తూఫాన్ మళ్లినట్లు తెలిపింది.

కాకపోతే అక్టోబర్ 22 నుంచి 28 వరకు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాలు వల్ల నవంబర్ మొదటి వారం నుంచి కోస్తాంద్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ‘సిత్రాంగ్’ తుఫాన్ ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలపై ఉంటుందని.. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. మత్స్యకారులను బుధవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.