బెంగాల్‌ను తాకి..బంగ్లాదేశ్‌ వైపుగా ‘ఫణి’

Cyclonic Fani
Cyclonic Fani


హైదరాబాద్‌: తీవ్ర తుఫానుగా మారిన ‘ఫణి’ పశ్చిమ బెంగాల్‌ను తాకి బంగ్లాదేశ్‌ వైపుగా దూసుకెళ్తోంది. ఈరోజు తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో ఒడిశాలోని బాలసోర్‌ మీదగా బెంగాల్‌ను ఫణి తాకింది. అయితే బెంగాల్‌లో శుక్రవారం మధ్యాహ్నం నుండే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఫణి బంగ్లాదేశ్‌ దిశగా దూసుకెళ్తున్న సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఫొని బంగ్లాదేశ్‌ను తాకే అవకాశం ఉంది. బెంగాల్‌లో తుఫాను ఫొని ప్రభావంపై ఆ రాష్ట్ర గవర్నర్‌ శ్రీ కేసరినాథ్‌ త్రిపాఠితో మాట్లాడినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకుంటామని మోదీ చెప్పారు. ఈస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాలో 15 వేల మంది, వెస్ట్‌ మిడ్నాపూర్‌ జిల్లాలో 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ ఈదురుగాలులు, వర్షం నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులను నిలిపివేశారు. ఫొని తుపాను బలహీనపడడంతో తిరిగి ఇవాళ ఉదయం 9:45 గంటల నుంచి విమాన సర్వీసులను ప్రారంభించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/