దిశ కేసులో చార్జీషీటు వేయనున్న పోలీసులు

Disha incident
Disha incident

హైదరాబాద్‌: షాద్‌నగర్‌ హత్యోదంతం కేసులో సైబరాబాద్‌ పోలీసులు డిసెంబర్‌ నెలాఖరులోగా చార్జీషీటు వేసేందుకు సమాయత్నం అవుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన డిఎన్‌ఏ రిపోర్టులు, ఫోరెన్సిక్‌ రిపోర్టులు తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. కాగా ఈ కేసులో 50 మందికి పైగా సాక్షుల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా డిఎన్‌ఏ, ఫోరెన్సిక్‌ రిపోర్టులతోపాటు సంఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ కూడా ఈ కేసులో కీలక ఆధారులుగా ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేశామని, సేకరించిన వివరాలతో చార్జీషీటు వేయనున్నట్లు కూడా అధికారులు తెలిపారు. చార్జీషీటు అనంతరం కోర్టులో విచారణ ప్రక్రియ మొదలవుతుంది. కాగా ఈ కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌ చనిపోయిన నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక టీమ్‌ ఈ కేసును దర్యాప్తు చేయనున్న విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/