‘మా’ ఎలక్షన్స్ : తెలుగు బిడ్డలనే గెలిపించాలని సీవిఎల్ నరసింహారావు పిలుపు

'మా' ఎలక్షన్స్ : తెలుగు బిడ్డలనే గెలిపించాలని సీవిఎల్ నరసింహారావు పిలుపు

‘మా’ ఎలక్షన్స్ బరిలో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ల మధ్య పోటీ జరగబోతుంది. అక్టోబర్ 10 న ఎన్నికల జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇరు ప్యానల్ సభ్యులు ఓ పక్క ప్రచారం చేస్తూనే మరో పక్క ప్రత్యర్థి ప్యానల్ ఫై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సీవి ఎల్ నరసింహారావు సంచలన కామెంట్స్ చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను మాత్రమే గెలిపించాలని సీ వి ఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.

దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాష్ రాజ్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేకుండా వుంటే బాగుంటుందని సూచనలు చేశారు. బహుశా ప్రకాష్ రాజ్ విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నానని సీ వి ఎల్ నరసింహారావు పేర్కొన్నారు. నరసింహారావు.. మా అధ్యక్ష ఎన్నికల బరిలో ముందుగా నిలబడ్డారు. కానీ ఆ తర్వాత ఏమైందో చివరి నిమిషంలో విత్ డ్రా చేసుకొని..ఇప్పుడు విష్ణు ప్యానల్ కు మద్దతు ఇస్తున్నారు.