సౌందర్య ఛాయ

CUTE1
CUTE

సౌందర్య ఛాయ

ఆలివ్‌ ఆయిల్‌, పాలమీగడ కలిపి, మసాజ్‌ చేసుకుంటే, ముఖం మీది మచ్చలు, ముడుతలు పోతాయి. ్శ ఆవ్ఞపాలు, పెరుగు, రాస్తే, నునుపు కాంతివస్తాయి.
అవిశగింజలు, పిప్పళ్ళు, గోధుమలు, మినపప్పు, సమంగా తీసుకుని పొడిగా చేసి, నలుగుపెట్టుకుంటే కాంతివస్తుంది. ్శ ముల్తానీమట్టి, బొప్పాయి గుజ్జు, తేనె, ఒక్కొక్క టేబుల్‌స్పూన్‌ తీసుకుని, బాగా కలిపి, ముఖానికి రాసుకోవాలి.

పావుగంట అయ్యాక చల్లటినీళ్ళతో కడిగేసుకోవాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే, చర్మం కాంతివంతంగా, నున్నగా అవ్ఞతుంది. ్శ బొప్పాయిగుజ్జును ముఖానికి రాసుకుని ఆరాక కడిగేసుకుంటూ ఉంటే, మృతకణాలు తొలగి కాంతివస్తుంది.

కమలా, నిమ్మ, తొక్కలను ఎండబెట్టి, పొడిగాచేసి ఆ పొడిలో వేపాకులను, గులాబీ రేకులను, గుండగా చేసి, కలిపి వట్టివేళ్ళను దంచి, పొడిగా చేసి, ఆ పొడిని, శనగపిండిని ఒక్కొక్క చెంచా చొప్పున, ఆ పొడుల్లో కలిపి దాచుకోవాలి.

అప్పుడప్పుడూ ముఖానికి రాసు కోవడం, ఒంటికి నలుగుపెట్టుకోవడం చేస్తూ ఉంటే ముఖానికి, ఒంటికి మెరుపు వస్తుంది. ్శ గంధము, జాజికాయ, మిరియాలు, సమ పాళ్ళలో తీసుకుని నూరి రోజూ రాసుకుంటే కొన్నాళ్ళలో మొటిమలు పోతాయి.

కీరదోస, లేక పుచ్చకాయ గుజ్జులో నాలుగుచుక్కలు చందన తైలం కలిపి ముఖానికి రాసుకుంటే రంగు కాంతివస్తాయి. ్శ బాదంపొడి, చందనంపొడి, చెంచాడేసి తీసుకుని తగినన్ని పాలు, కొబ్బరినూనె కలిపి, ముఖానికి రాసుకుని కడిగెయ్యాలి.

వారానికి ఒకసారి ఇలాచేస్తే ముఖం కాంతులీనుతుంది.

మంచిగంధం పొడి, జీలకర్రపొడి, నీటితో కలిపి, ముఖానికి రాసుకుంటూంటే, క్రమేపీ మొటిమలు మచ్చలుపోతాయి.