పండ్లతో మెరిసిపోతారు

CUTE
CUTE

పండ్లతో మెరిసిపోతారు

రెండు అరటి పండ్లు తీసుకుని వాటిని మెత్తగా చిదిపి అందులో రెండు టేబుల్‌ స్పూన్ల తేనెని కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత షాంపూతో స్నానం చేస్తే జుట్టు మెత్తగా మెరుస్తూ ఉంటుంది. ఆరు అరటిపండ్లు తీసుకుని అందులో రెండుగుడ్లు, అరకప్పు బీరు- కలిపిన మిశ్రమాన్ని తలకు జుట్టు కుదుళ్ళకు పట్టేలా బాగా రాసుకుని అరగంటపాటు ఉంచుకుని తరువాత షాంపూతో స్నానం చేయాలి.

నిమ్మకాయ, టీ పొడులతో: వడగట్టిన ఒక గ్లాసు టీ డికాషన్‌లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండాలి. షాంపూతో తలస్నానం చేశాక ఈ నీటితో చివరగా జుట్టుని కడగాలి.

తేనె, వెనిగర్‌లతో: ఒక టేబుల్‌ స్పూను తేనె, ఒక లీటరు నీరు, ఒక టేబుల్‌ స్పూను వెనిగర్‌లను తీసుకుని వీటి మిశ్రమంతో కూడా తలస్నానం అయ్యాక జుట్టుని కడిగితే జుట్టు మదువుగా మారి మెరుస్తుంది. ఈ మిశ్రమం పొడి, సాధారణ జుట్టులకు మరింత అనువైనది. చర్మం ముడతలు తగ్గేందుకు: ఒక గుడ్డుని, రెండు బాగా చిదిపిన అరటిపళ్ళతో కలిపి మిశ్రమం తయారు చేయండి. దీనిని మొహానికి మెడకు రాయండి. పదిహేను నిముషాలపాటు అలాగే వదిలేసి, తరువాత మొదట పాలతోనూ, అనంతరం నీటితోనూ కడగాలి. దీనివల్ల చర్మం ముడతలు మాయమై మదువుగా మెరుస్తుంటుంది.

మోచేతులు, కాళ్ళ నునుపుకోసం:
సాధారణంగా మోచేతులు, కాళ్ళు గరుకుగా ఉంటాయి. రెండు అరటి పళ్ళలో రెండు టేబుల్‌ స్పూన్ల పంచదారని కలిపి ఈ మిశ్రమాన్ని పైన చెప్పిన శరీర భాగాలమీద రాస్తే ఆ భాగాలు నునుపుగానూ మంచి రంగుకి మారతాయి. అందమైన చేతుల కోసం: రెండు అరటి పళ్ళు, నిమ్మరసం, రెండు స్పూన్ల ఓట్‌మీల్‌ ఇవన్నీ కలిసి చేతులకు రాయాలి. ఒక క్రమ పద్ధతిలో ఈ మిశ్రమంతో చేతులకు మర్దనా చేయాలి.

మూడు అరటి పళ్ళు తీసుకుని ఒక గుడ్డుని, రెండు స్పూనుల షీకాయ పొడిని కలిపి జుట్టుకి బాగా పట్టించి అరగంటపాటు అలాగే ఉంచి తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. సగం బంగాళ దుంప తురుములో నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను చైనా మట్టిని కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారు చేసి దీనిని మొహానికి రాసుకుని ఇరవై నిముషాల అనంతరం చల్లని నీటితో కడిగేయాలి. పచ్చి బంగాళ దుంపని తురిమి దాని నుంచి రసాన్ని తీయాలి. ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో మొహమంతా పట్టించాలి. మొహం శుభ్రంగా ఆరేదాక ఆగి అనంతరం కడిగేయాలి.

టమాటా రసాన్ని మొహానికి రాసుకుని ఆరే వరకు ఆగి తరువాత కడిగేస్తే మొహానికి ఉన్న జిడ్డు తొలగుతుంది. ఒక టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టి, ఒక నిమ్మకాయ రసం, సగం టమాటా ఈ మూడింటిని మిశ్రమం చేసి మొహానికి రాసుకుంటే జిడ్డు తగ్గి మొహం మదువుగా మారుతుంది.