ఆకర్షణ కాదు ఆరోగ్యం ముఖ్యం

CUTE-2
CUTE

ఆకర్షణ కాదు ఆరోగ్యం ముఖ్యం

అమ్మాయిలు జిడ్డు సమస్యతో బాధపడుతూ ఆత్మనూన్యతకు గురవ్ఞతున్నారు. జిడ్డుచర్మం తయారుకావడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. మీ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటపుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్లు జిడ్డుచర్మాన్ని కలిగించే కారణాల్లో ప్రధానపాత్రని పోషిస్తాయి. యుక్త వయసులో చాలామందికి నుదురు, బుగ్గలు, ముక్కువంటివి స్నిగ్దంగా మెరిసేది ఇందుకే.

కాగా చాలామంది మహిళల్లో గర్భధారణ సమయాల్లో కాని, నెలసరి ముందుగాని లేదా రజోనివృత్తి సమయంలోగాని హఠాత్తుగా ముఖం నూనె కారుతున్నట్టు తయారయ్యేది కూడా ఈ హార్మోన్ల తేడా వల్లనే. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగటం, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు, చెమటలు ఎక్కువ పట్టటం, కృత్రిమ సౌందర్య ఉత్పత్తులు మొదలైనవి జిడ్డు చర్మానికి కారణం అవుతాయి. నీళ్లు బాగా తాగాలి: మంచినీళ్లు బాగా తాగాలి. అవసరాన్ని బట్టి రోజుకు నాలుగునుంచి ఆరు లీటర్ల మంచినీళ్లు తాగాలి. ్జ ఆహారంలో నీరు ప్రధానంగా ఉండే కూరగాయలు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, కాకరకాయ వంటి నీరు ప్రధానంగా కలిగిన శాకాలను, ఆకుకూరలను తీసుకోవాలి. ్జ ముఖంమీద మాయిశ్చరైజర్లు, మందపాటి మేకప్‌లు, ఆయిల్‌ బేస్‌తో తయారైన సౌందర్య ఉత్పత్తుల్ని వాడవద్దు.

ఇది స్వేదరంధ్రాలను అడ్డుకుని సమ స్యను మరింత ఉధృతం చేస్తాయి. అయితే మరీ అవసరం అనుకుంటే చిన్న పిల్ల లకు వాడే బేబీ పౌడర్‌ను వాడవచ్చు. ్జ చర్మం జిడ్డుగా తయారవుతున్నపుడు సరైనరీతిలో శుభ్రపరచుకోవటం అన్నింటికంటే ముఖ్యం. రోజుకు మూడుసార్లు గోరువెచ్చనినీటితో శుభ్రం చేసు కోవాలి. అవసరమైతే మూలికల చూర్ణాన్ని వాడితే మంచిది. ఇవి చర్మంమీద మృతకణాలను సురక్షితంగా తొలగిస్తాయి. మురికి విషతత్వాలు, కాలుష్యం వల్ల పేరుకుపోయిన వ్యర్థాలు వంటివాటిని కూడా ఈ చూర్ణాలు తొలగించి ముఖ చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి. ఉదాహరణకు పసుపుకు నిమ్మరసం చేర్చి చర్మంమీద ప్రయోగిస్తే జిడ్డుతనం వంటివి తొలగిపోతాయి.

అలాగే లొద్దుగ, తులసి, జాజికాయ, వేపబెరడు, తెల్లమద్ది, త్రిఫలాలు, తుంగ ముస్తలు, కస్తూరి పసుపు వంటివాటిని నేరుగా గాని లేదా ఆవ నూనెలో కలిపిగాని వాడవచ్చు. ్జ మధ్యమధ్యలో నూనెను పీల్చుకునే తత్వంగల టిష్యూ పేపర్‌ని, స్పిరిట్‌తో తడిపిన పేపర్‌ నాప్‌కిన్స్‌ని కూడా వాడవచ్చు. చర్మంమీద పేరుకుపోయిన అదనపు నూనెను తొలగించడానికి యాపిల్‌ సిడర్‌ వెనిగార్‌ బాగా ఉపయోగపడుతుంది.

వారానికి ఒకసారి టమాటా లేదా బొప్పాయి గుజ్జుతో ముఖానికి మాస్క్‌ పెట్టుకోవాలి. లేదా కీరదోసకాయలోని రసాన్ని తీసి కలబందగుజ్జును కలిపి వాడవచ్చు. మెంతిపొడిని ఎర్ర కంది పప్పుపొడిని గోరువెచ్చని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి మొహానికి అప్లయి చేయవచ్చు. జిడ్డు మరీ తీవ్రంగా ఉంటే ముల్తానీ మట్టి బాగా పనిచేస్తుంది. ముల్తానీ మట్టిని నీళ్లలోకలిపి మొహానికి రాసు కుని 20 నిముషాలు ఆగి చన్నీళ్లతో కడిగేయాలి. తరువాత తడి ఆరిపోయేలా మెత్తని టవల్‌తో అద్దుకోవాలి. మట్టి ఎంత ముదురు రంగులో ఉంటే నూనెను అంత ఎక్కువగా పీల్చుకో గలుగుతుంది. ్పు క్కువగా పీల్చుకో గలుగుతుంది.