ఎస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు శుభవార్త

ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ

yes bank
yes bank

న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఎస్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. మంగళవారం ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల్ని పునరుద్ధరించింది బ్యాంకు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించింది. ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల పునరుద్ధరణతో ఎస్‌ బ్యాంక్ కస్టమర్లకు కాస్త ఊరట లభించినట్టే. ఎస్‌ బ్యాంక్ కస్టమర్లు ఐఎంపీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ఉపయోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, లోన్ల ఈఎంఐలు చెల్లించాలనుకునేవారికి ఈ సేవలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎస్‌ బ్యాంక్‌లో విత్‌డ్రా పరిమితి రూ.50,000 మాత్రమే. ఆర్‌బీఐ యెస్ బ్యాంకుపై ఏప్రిల్ 3 వరకు మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు ఆర్‌బీఐ మారటోరియం విధించినా మార్చి 15 నాటికి ఈ విత్‌డ్రా పరిమితి తొలగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నియమించిన అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/