చెన్నైలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

సైకిల్‌పై వచ్చి నోట్లు వెదజల్లి పోతున్న గుర్తుతెలియని వ్యక్తులు..కరోనా వ్యాప్తికి కుట్రని అనమానాలు

Currency notes

చెన్నై: చెన్నైలో కరెన్సీ నోట్లు కలకలం రేపుతుంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తున్నాయి. అయితే కరెన్సీ నోట్లుతో కరోనా వ్యాప్తికి కుట్ర జరుగుతోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని పురసైవాక్కం, వెస్ట్‌ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లోని ఇళ్ల ముందు రాత్రివేళ నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చెన్నై మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లి వెళ్లిపోయారు. గమనించిన కొందరు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా చిక్కలేదు. నోట్లు చల్లిన వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు జనం భయపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/