ఏపీ లో నెలాఖరుదాకా కర్ఫ్యూ పొడిగింపు

సీఎం జగన్ ఆదేశాలు

Curfew extension in AP
Curfew extension in AP

Amaravati: ఏపీ లో కర్ఫ్యూను మే నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. కనీసం నాలుగువారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ఫ్యూ విధించి 10 రోజులే దాటిందని, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సిఏం పేర్కొన్నారు. కరోనా తో ఎవరైనా తల్లి దండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలని., వారిపేరుమీద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా యోచన చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జగన్ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/