క్యూబా నిరసనకారులకు 25 ఏళ్ల జైలు శిక్ష‌

హ‌వానా: క్యూబాలో గ‌త ఏడాది ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు హోరెత్తాయి. ఆ స‌మ‌యంలో సుమారు 381 మందిని అరెస్టు చేసి శిక్ష వేశారు. అయితే దాంట్లో కొంద‌రికి 25 ఏళ్ల పాటు శిక్ష ప‌డిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 297 మందిపై దేశ‌ద్రోహం, దాడి, దొంగ‌త‌నం, అల్ల‌ర్లు సృష్టించ‌డం వంటి కేసుల‌ను న‌మోదు చేశారు. స్వేచ్ఛ కావాలంటూ గ‌త ఏడాది క‌మ్యూనిస్టు దేశం క్యూబాలో వేలాది మంది నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం వ‌ల్ల ధ‌ర‌లు పెర‌గ‌డం, ఆహార కొర‌త వ‌ల్ల ఆందోళ‌న‌లు మిన్నంటాయి. శిక్ష‌ప‌డిన‌వారిలో 16 ఏళ్ల‌లోపు పిల్ల‌లు కూడా ఉన్నారు. అల్ల‌ర్ల వెనుక అమెరికా హ‌స్తం ఉన్న‌ట్లు క్యూబా అధ్య‌క్షుడు మిగుల్ డియాజ్ కానెల్ ఆరోపించారు. ఆందోళ‌న‌కారుల కేసు విచార‌ణ‌లో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని, అరెస్టు చేసిన వారిని రిలీజ్ చేయాల‌ని అమెరికా డిమాండ్ చేస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/