ఐపిఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన చెన్నై

dhoni
dhoni

విశాఖపట్నం: ఐపిఎల్‌-12 సీజన్‌లో డాడీస్‌ ఆర్మీగా పిలిచే చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకుంది. రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆ జట్టు ఎనిమిదోసారి ఫైనల్‌లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. చిరకాల ప్రత్యర్ది ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయింది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్‌ ఐన అనంతరం ధోని విజయం సాధించడానికి గల కారణాలు వెల్లడించాడు. తమ విజయంలో బౌలర్లదే కీలకపాత్ర అని, కీలక సమయాల్లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించారు. ఏ మ్యాచ్‌లోనైనా ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడం చాలా కష్టం. ఈ సీజన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఆఖరి వరకూ క్రీజులోనే ఉండి మ్యాచ్‌ ముగిస్తే బాగుండేదనిపించింది. ఏదేమైనా తమ జట్టు ఫైనల్‌కు చేరుకోవడం సంతోషాన్ని కలిగించిందని ధోని పేర్కోన్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/