బిఆర్‌కె భవన్‌లో ప్రారంభమైన పాలన

మంగళవారం నుంచి పూర్తి స్థాయి పరిపాలన

BRKR Bhavan
BRKR Bhavan

హైదరాబాద్ : శుక్రవారం నుంచి బిఆర్ కె భవన్ వేదికగా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. బిఆర్‌కె భవన్‌లో ఏర్పాటు చేసిన తన చాంబర్‌లోకి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తన చాంబర్‌కు వచ్చారు. శ్రావణ శుక్రవారం, దశమి ఒకేసారి రావడంతో ఈ దివ్యమైన ఘడియల్లో పనులు ప్రారంభించేందుకు కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు బిఆర్‌కె భవన్‌కు వచ్చి తమ చాంబర్‌లో కూర్చొని వెళ్లారు. వరుసగా శనివారం నుంచి వరుసగా 3 రోజులు ప్రభుత్వ సెలవు రావడంతో మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. సచివాలయంలో ఇంకా కొంత సామగ్రి తరలింపు మిగిలి ఉండడంతో ఈ మూడు రోజులు ప్యాకర్స్ మూవర్స్ వారు వాటిని తరలించే పక్రియను వేగవంతం చేయాలని సిఎస్ వారిని ఆదేశించారు.

వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నా ప్రభుత్వం ప్రతిపాదించిన భవనాల్లోకి సచివాలయ కార్యాలయాలను తరలించాలని సిఎస్ అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కొన్ని శాఖలు కావాలనే ఫర్నీచర్‌తో పాటు సామగ్రిని తరలించడానికి సిద్ధం కాకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసిం ది. అన్ని శాఖల ముఖ్యకార్యదర్శుల కార్యాలయాలను ప్రతిపాదించిన భవనాల్లోకి మార్చాలని టెక్నికల్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో కచ్చితంగా ఆదేశాలు పాటించాలని సిఎస్ వారికి సూచించినట్టుగా సమాచారం. ఇప్పటి కే బిఆర్‌కె భవన్‌లో ప్రభుత్వశాఖల కార్యాలయాలు సిద్ధం కావడంతో కొన్ని శాఖల ఫర్నీచర్‌ను అక్కడకు తరలించా రు. కార్యాలయాలను సూచించే బోర్డులను సైతం పెట్టా రు. అధికారులకు పార్కింగ్ వసతి కల్పించారు. ప్రత్యేక భద్రతా దళం భద్రతా ఏర్పాట్లను సైతం చేపట్టింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/