ఆత్మహత్యలతో! తగ్గుతున్న స్త్రీల శాతం

CRYING
CRYING

ఆత్మహత్యలతో! తగ్గుతున్న స్త్రీల శాతం

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా, చదివినా స్త్రీ ఆత్మహత్యల విషయాన్ని వింటున్నాం, చూస్తున్నాం. ఏదో ఒక విధంగా కారణాలు చిన్నవైనా, పెద్దవైనా ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనల వలన కూడా ఆడజాతి అంతరించి పోతుంది. వివాహం, వివాహేతర సంబంధాల కారణాల వలనో, ప్రేమవలనో, అనుమానాల వలనో, అత్తా,కోడళ్ల మధ్య సత్సంబంధాలు లేకపోవడం చేతనో, వరకట్నం తోటో మగపిల్లలు కలగ లేదనో, ఇలా ఎన్నెన్నో కారణాలు స్త్రీల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. గ్రామాలలోను, పట్టణాలలోను జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనాలు. మన చుట్టుప్రక్కల ఎన్నెన్నో విషయాలు మనసును కలచివేస్తుంటాయి.

ఇటీవల అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామంలో గౌరమ్మ అనే మహిళ పాతికేళ్లు నిండకుండానే తన ఇద్దరు ఆడపిల్లల్ని ఆరేళ్లు, రెండేళ్లు నిండకుండానే కొడవలితో గొంతుకోసి చంపి తాను కూడా కొడవలితో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది.ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట కాదు, వందలలో, వేలలో జరుగుతున్నాయి. జరుగుతాయి. జరుగబోతున్నాయి కూడా. స్త్రీలు కుటుంబ కలతలతో, కలహాలతో వందేళ్ల నిండు జీవితాలను, వందేళ్ల కాపురాలను కోటగోడల్లా కూల్చుకుంటున్నారు. వాళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో తమని నమ్ముకున్న తమవాళ్లను బాధలకు గురిచేస్తున్నారు. నిత్యం కుటుంబ కలహాలతో మనస్థాపాలకు గురయితే ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటాయని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆత్మహత్య ఆలోచనలు మనసు నుండి వైదొలగాలంటే…

సాను కూల దృక్పథం అలవరచుకోవాలి. ప్రతిచిన్న విషయాన్నీ భూతద్దంలోంచి చూడకూడదు. విమర్శల నైనా, సద్విమర్శలనైనా సహృదయంతో ఆహ్వానించాలి. కుటుంబాలలో అత్తా,కోడళ్ల మధ్య పోట్లాటలు, తోడికోడళ్ల మధ్య మనస్పర్థలు మామూలే. అందరి ఇళ్లలోని దోసెలకు చిల్లులున్నట్లు, అందరిళ్లల్లో మనుషుల మధ్య గొడవలు మామూలే. అయితే ఈ గొడవలు హత్య లకు, ఆత్మహత్యలకు మరొకరి వినాశనానికి రహదారులు కాకూడదు.

చావు అన్ని సమస్యలకు పరిష్కార మార్గమే అయితే అసలీ భూమిమీద జనాభా ఉండేదే కాదేమో? ఆవేశం, ఆలోచన: ఆవేశం మనిషిలోని విచక్షణా జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఆవేశంతో సమస్యల్ని పరిష్కరించే శక్తిని కోల్పోయి పురుగుల మందులు తాగో, బావ్ఞలలో పడ్డం ద్వారా, ట్రెయిన్‌ కింద పడిపోవడం లాంటి విచక్షణారహితమైన పనుల ద్వారా జీవితాల్నే కోల్పోతున్నారు. మనిషిలోని ఆవేశం తగ్గిపోయాక ఆ తర్వాత ఏం చేసినా జీవితాలు తిరిగిరావ్ఞ. మంచి ఆలోచనల ద్వారా మంచి కార్యాలు చేయగలం. అతిగా ఆలోచించడం చేయకూడదు. ఒక విషయం గురించి నిర్ణయాలు తీసుకునేముందు మంచి,చెడుల్ని బేరీజు వేసుకుని, జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలి. కోపం: కోపమే అన్ని సమస్యలకు మూలం. కోపం వచ్చినపుడు కాసేపు మౌనం వహిస్తే కోపం దానంతట అదే తగ్గిపోతుంది.

కోపం మనిషిలోని మానవత్వాన్ని నశింపచేస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య కోపం చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది.మానవతకు మూసపోసి రూపాన్నిస్తే అది అమ్మగా రూపుదిద్దు కుంటుంది. అలాంటి అమ్మ, దేవ్ఞడికి ప్రతిరూపమైన అమ్మలు కష్టాలకు, కన్నీటికి, జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలకు భయపడి, తాము ఆత్మహత్య చేసుకుని, తమ ప్రేమకు ప్రతిరూపాలైన తమ పిల్లలను చంపి, వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు మీరెందుకు చావాలి, మీ పిల్లల్నెందుకు చంపాలి? దేవ్ఞడు మనకిచ్చిన అపురూపమైన మానవజన్మ అనే అవకాశాన్ని చేజేతులారా దూరం చేసుకోవడం, చేయడం నేరం కాదా? మహిళలు సమాజంలో అందరిచేత అణగదొక్కబడుతూ, గోడకు విసిరిన బంతుల్లా పైపై కెదగాలి. తనలోని శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలి. తామేమిటో, తమ శక్తియుక్తులేమిటో నిరూపించి, తమ స్థానాన్ని నిరూపించుకోవాలి. గానీ పిరికితనంతోటి ఆత్మహత్య చేసు కోవడం నేరం పాపం. తమలాంటి పిరికి తల్లులకు పుట్టిన నేరానికి పసిబిడ్డల్ని చంపేయడం ఎంత కసాయితనమో కదా? జంతువ్ఞలు, పక్షులు తమ బిడ్డలనెంత ప్రేమగా చూసుకుంటాయో. ఇలాంటి నిర్ణయాలు అమ్మలకు తగవ్ఞ. పట్టువిడుపులుండాలి: భార్యాభర్తల మధ్యన కానీ, ఇతర కుటుంబసభ్యుల మధ్యన సత్సం బంధాలుండాలి.

అసూయ, ద్వేషాల తోటి ఒకే ఇంట్లో ఉంటూ శత్రువ్ఞల్లా బతకకూడదు. అపార్థాల్ని వీడి అర్థం చేసుకోవాలి. ఒకరి మనసును మరొకరు తెలుసుకోవాలి. ఒకరికి మరొకరు పరాయివారు కాదనీ, ఒకే గూటిపక్షులని తెలుసుకోవాలి. కోడలిని ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడని అత్తగారికి కోడలిపై కోపం ఉండకూడదు. అత్తగారు ఒక కోడలిని ఒక విధంగాను, మరో కోడలిని మరోవిధంగాను చూస్తుందని కోడళ్లు అత్తలతో పోట్లాటలకు దిగకూడదు. ఇలా ఒకటేమిటి, కుటుంబంలో సవాలక్ష ఎదురయ్యే సమస్యల్ని కుటుంబంలోని వ్యక్తులంతా ఐక్యత తోటి, సఖ్యతను పెంచుకోవాలి. కానీ దాయాదుల్లా కలహాలతో కాపురం చేయకూడదు. అనుమానాలు అపోహలు : ఏడడుగుల సాక్షిగా వందేళ్ల కాపురానికి నాంది పలికిన మూడుముళ్ల బంధాన్ని తెంచే శక్తి ఏ అనుమానాలకు, అపోహలకు లేదు. పెళ్లి అనే బలమైన బంధాన్ని అనుమానాలు బలహీనం చేసి, అపోహలు పెరిగి భార్యభర్తల మధ్యన ఆత్మహత్యలకు, హత్యలకు దారితీసేలా చేస్తోంది.

ఈ అనుమానాలకు పసిపిల్లల్ని బలిచేసేస్తున్నారు. ఇది తగదు. భార్యా భర్తల మధ్యన అనుమానాలు, పోట్లాటలు రాత్రికి వచ్చి తెల్లవారేలోపు పోయే మబ్బుల్లా ఉండాలి. కానీ ఇద్దరి మధ్యన అనుమానమనే గోడగా నిలవకూడదు. అబలే..: ఆడది ఈ విషయంలో అబలగానే ప్రవర్తిస్తోంది. అసలు పరిస్థితుల్ని సుగమం చేసుకోవడం లేదు. తన ఆలోచనా విధానం తోటి బలహీ నంగా ఆలోచిస్తోంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని, తన శక్తి సామర్థ్యాలతోటి ఇంటా, బయట మెప్పుపొందుతూ కుటుంబ సభ్యుల మధ్యన వారధిగా నిలవాలి కానీ ఆత్మహత్యకు పాల్పడేటంత తప్పు చేయకూడదు. అమృతవర్షిణి అమ్మగా నిలవాలి కానీ ప్రాణాల్ని కబలించే కసాయి తల్లిగా పేరు పొందకూడదు.

దేవుడు తనకు మారుగా అమ్మరూపంలో పిల్లకోసం ప్రతి కుటుంబం కోసం ఈ భువికొరకై పంపించాడని అర్థం చేసుకోవాలి. త్యాగశీలిగా, ఓర్పుతో, నేర్పుతో, తన తెలివితేటలతో మంచి మనిషిగా పేరు పొంది, తన విజ్ఞతతోటి అందరి మన్ననలు పొంది, తాను నొప్పించుకోకుండా, చాకచక్యంతోటి పనుల్ని చేసుకు పోతే, ఎలాంటి అనుమానాలు, అపార్థాలు మనస్పర్థలు చోటు చేసుకోవ్ఞ.ప్రతి కుటుంబానికి మూల బిందువ్ఞలైనటువంటి స్త్రీలకోసం వాళ్లు కోరుకున్న, వాళ్లు ఆశించిన వాతావరణం పరిస్థితుల్ని ఏర్పర్చాలి. స్త్రీలకు ఆత్మహత్య చేసుకోవాలన్న, ఆలోచన కూడా కలుగకుండా ఆ ఇంటి కుటుంబసభ్యులంతా వారితో స్నేహభావాన్ని పెంపొందించగలిగితే ఈ ఆత్మహత్యలు కాస్తయినా తగ్గుతాయి. భర్తలు భార్యలపై అనుమానాలు తగ్గించుకుని నమ్మకమనే వారధిపై కలకాలం నడచి, ఆనందమయమైన జీవితాన్ని కొనసాగితే ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి. మహిళ జనాభా పెరుగుతుంది.