ప్రయాణికులందరికీ ఐఫోన్లు ఇచ్చిన జపాన్‌

డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో మొత్తం 3700 మంది

2,000 iPhones Given for Free to Passengers Aboard Coronavirus
2,000 iPhones Given for Free to Passengers Aboard Coronavirus

టోక్యో: జపాన్‌లోని యొకోహోమో తీరంలో నిలిపివేసిన డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే నౌకలోని ప్రయాణికులందరికీ ఆ దేశ ప్రభుత్వం ఐఫోన్లను ఉచితంగా పంపిణీ చేసింది. కోవిడ్‌ లక్షణాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులతో టచ్‌లో ఉండేందుకు అత్యాధునిక ఫోన్లను వారికి అందించనట్లు పేర్కొంది. డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 3,700 మంది ఉన్నారు. వీరిలో దాదాపు కోవిడ్‌ సోకిన వారి సంఖ్య 350కి చేరినట్లు వార్తలు వెలువడటంతో ..నౌకలో ఉన్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై సర్వాత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో జపాన్‌ వైద్యశాఖ, దేశ అంతర్గత వ్యవహారాల శాఖతో సమన్వయమై..2000 మందికి ఐఫోన్లు పంపిణీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/