జవాన్ల కుటుంబాలకు ఏపి ప్రభుత్వం సహాయం

CRPF terror attackpulwama, chandrababu
CRPF terror attackpulwama, chandrababu

అమరావతి: ఏపి సిఎం చంద్రబాబు పుల్వామా ఉగ్రదాడి సంఘటన బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని చంద్రబాబు సూచించారు.వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు.