లీవ్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్న జవాన్

ఒక్క రోజు లీవ్ ఇవ్వలేదని ఓ జవాన్ ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ​జోధ్​పుర్​లోని సీఆర్​పీఎఫ్​ శిక్షణా కేంద్రం క్యార్టర్స్​లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న జవాన్​ నరేశ్​.. ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను శనివారం అడిగాడు. కొన్ని కారణాల వల్ల అధికారులు సెలవు మంజూరు చేయలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నరేష్.. తన సహద్యోగి తో గొడవ పెట్టుకొని చేయిని కొరికాడు. ఆ తర్వాత అతడ్ని శాంతింపజేయడానికి పలువురు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

ఆ తర్వాత అక్కడ నుంచి నరేశ్ నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి తాళం వేసుకుని భార్య, బిడ్డలతో తనను తాను బంధీ చేసుకున్నాడు. అలా 18 గంటలు బందీలా గడిపాడు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్‌తో కాల్చుకున్నాడు. తనను కాల్చుకున్న సందర్భంలో తన దగ్గరికి ఎవరైనా వస్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు నరేశ్‌తో ఫోన్‌లో మాట్లాడినా ఉపయోగం లేకపోయింది. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.