రానున్న 15 రోజుల్లో పంటల బీమా నోటిఫికేషన్‌

Crop Insurance
Crop Insurance

హైదరాబాద్‌: వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథీ గురువారం సచివాలయంలో స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల కమిటి (ఎస్సెల్బీసీ), బ్యాంకర్లు, ఇన్సూరెన్స్‌ కంపెనీ, డీఈఎస్‌, టీఎస్‌డీపీఎస్‌ (స్టేట్‌ ప్లానింగ్‌ డిపార్డ్‌మెంట్‌) ప్రతినిధుల సమావేశంలో 201718లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు 201920 సంవత్సరానికి వానకాలం, యాసంగి సీజన్లలో పంటల బీమా అమలు కోసం 15 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.బీమా అమలుచేసే కంపెనీలను ఖరారు చేసినట్టు చెప్పారు. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాపథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) కింద ఈ ఏడాది నుంచి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా టమాటా పంటను చేర్చినట్టు తెలిపారు. 201718 క్లెయిమ్స్‌కు సంబంధించి వానకాలం రూ.62.40 కోట్లు, యాసంగికి రూ.17 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు చెల్లించాల్సి ఉందనన్నారు. పంటకోత ప్రయోగాల ఫలితాలే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లెక్కించు 201819లో వడగండ్లకు పంట దెబ్బతిన్న విషయాన్ని 72 గంటల్లో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియజేయాలని సూచించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/telengana/