సర్కార్‌ ఉదాసీనత- కొనసాగుతున్న దూబే వారసత్వం!

యుపిలో నేర ప్రవృత్తి

Criminal propensity
Criminal propensity

దేశంలో నేరాలూ రాజకీయాలు పెనవేసుకుని ఉన్న రాష్ట్రాల జాబితాలో మొట్టమొదటి స్థానం ఉత్తరప్రదేశ్‌దే అన్న విషయం లో ఎటువంటి సందేహానికి తావు లేని విధంగా ఆ రాష్ట్రంలో పరిస్థితు లు ఉంటాయి.

అక్కడ ఏ పార్టీ అధి కారంలో ఉన్నా గ్యాంగ్‌స్టర్‌ల రాజ్యం కొనసాగుతూనే వస్తుంది. రాష్ట్రంలో నేరాలను అదుపు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గట్టిగా చెప్పిన యోగితొలినాళ్లలో నేరస్తులను వేటాడారనే చెప్పాలి.

అంతా కూడా ఇక నేరమయ రాజకీయాలకు తావ్ఞలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అందరూ ఆశించారు. అయితే ఆ హడావుడి మున్నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.

సిఎంగా యోగి ఆదిత్యనాథ్‌ బెదిరింపు రాజకీయాలకు, రౌడీయిజానికి, నేరాలకు ఉన్న లింకును తెగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నం జనా లలో కూడా ఆసక్తిని ఆశలనూ రేకెత్తించింది. అయితే రానురాను పరిస్థితి యధా పూర్వకంగానే మారిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో 19ఏళ్ల యువతి మనీషాని అదే గ్రామానికి చెందిన నలుగురు అగ్రకుల యువకులు భయంకరమైన చిత్రహింసలు పెట్టి, వెన్నెముక విరిచేసి సామూహిక అత్యాచారా నికి పాల్పడి, సాక్ష్యం చెప్పకుండా నాలుక కోసివేయడం అత్యంత అమానుష మైన సంఘటనగా భావించాలి.

ఈ దుర్మార్గం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవ్ఞతున్నది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ వారు కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు.సెప్టెంబర్‌ 29న మరణించింది.

విమర్శలను కొట్టిపారేయడం కాకుండా వాటిని సహేతుక సమాధానం వెతకాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనాఉంది.

అధికారయంత్రాంగం, బాధితులపట్ల వ్యవహరిం చిన తీరు అత్యంత అమానుషమైనది. దుర్మార్గమైనది.

మనీషా మృతదేహాన్ని తల్లిదండ్రులు ఎంత బతిమాలినా ఇవ్వకుండా తెల్ల వారుజామున పోలీసులు,మున్సిపల్‌ సిబ్బంది తగుల బెట్టేయడం, నేరస్తులకు అండగా నిలబడడం కోసం, వారిని రక్షించుకోవడం కోసం మనీషా సాక్ష్యాలను కాల్చేసారనే విమర్శ ఉంది.

గ్రామీణ భారతంలో అగ్రకులపెత్తందారీ దోపిడీ శక్తుల పట్టు ఎంత బలంగా ఉందో వారికి వ్యవస్థలన్నీ ఎలా రక్షణ కవచాలుగా ఉంటాయో ఈ ఘటన మరొకసారి రుజువు చేస్తున్నది.

మహిళలపై, ఆడపిల్లలపై గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరాయంగా భూస్వామ్య, పెత్తందారీ శక్తులు సాగిస్తున్న దౌర్జన్యాలు, లైంగిక హింసలు బయటకు రాకుండా పాతాళం లోతుల్లోకి పాతి పెట్టేస్తారు.

ఇలాంటి హింసాత్మక ఘోరమైన ఘటనలు సమాజం దృష్టిలోకి వచ్చినప్పుడు, బాధితులకు న్యాయం చేస్తామని మాట్లాడుతూనే నేరస్తులని కాపాడుకోవడం కోసం ఎంతకైనా బరితెగిస్తారని ఈ ఘటన మరింత స్పష్టం చేస్తున్నది.

ఇదేమీకొత్త కాదు. తనని నలుగురు యుకువలు అత్యాచారం చేసి హింసించా రని మనీషా తన స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకపోవడం అత్యంత దుర్మార్గం.

ఘటన జరిగిన 15 రోజులకుపైనే అయినా కూడా అధికారంలోనున్న పాలకులు ఇంతవరకు నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం ఘోరమైన విషయంగా పరిగణించాలి.

మహిళలపై హింసాత్మక లైంగిక దాడులు, హత్యలు ఎంత తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నా యో వివిధ అధ్యయనాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పెరుగు తున్న ఈ అమానుష హింసాత్మక దాడులను ప్రతిఘటించగల సంఘటిత ఉద్యమాలను నిర్మించుకోవడం నేటి అవసరం.

ప్రజల ప్రజాతంత్ర హక్కులను కాలరాసే ప్రభుత్వాల అసలు స్వభావాన్ని ప్రజల మధ్య నిరంతరం ఎండగట్టాలి. బూటకపు ప్రజాస్వామ్య నినాదాలు మూటన ఎన్నివేల, లక్షల మంది దళిత శ్రామికకులాల మహిళల, ప్రజల ప్రాణాలు ఆహుతవుతున్నాయో నిరంతరం మనం ప్రజలకు వివరించుకోవాలి.

ఈ హింసాత్మకదాడులకు వ్యతిరేకంగా యావత్‌ ప్రజానీకం తమ స్పందనలను, నిరసనను, ఆగ్రహాన్ని బలమైన గొంతుతో వ్యక్తం చేయడం నేటి అవసరం.

అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ నేర సామ్రాజ్యాన్ని యోగి సర్కార్‌ ఇంతకాలంగా కనీసం కదపలేకపోయింది.

అంతేకాదు యోగి టార్గెట్‌ చేసిన నేరస్తుల జాబితాలో నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్న వికాస్‌దూబే లాంటి పేరే లేకపోవడం ఆశ్చర్యం కలిగిం చక మానదు.

రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలో ఉన్నా దూబే దందా యధేచ్ఛగా సాగుతూనే ఉంది. వికాస్‌ దూబే దాష్టికం ఎంతగా చెలామణి అయ్యేదో చెప్పడానికి తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు బృందంపైనే తన అనుచరులతో కాల్పులు జరిపించడమే నిదర్శనం.

ఆ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు మరణిస్తే తప్ప ప్రభుత్వంలో చురుకు పుట్టలేదు.

ఓ రౌడీషీటర్‌ను పట్టుకోవ డానికి వెళ్లిన పోలీసులలో 8 మంది ఆ గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు కాల్చి చంపేశారంటే అక్కడ వారి ఆధిపత్యం, అధికారం ఎలా సాగుతోందో కళ్లకు కదలలేదంటే అక్కడి సర్కార్‌ ఎంత ఉదాసీ నంగా వ్యవహరిస్తున్నదన్న విషయం అవగతమవుతుంది.

వికాస్‌ దూబే నేరసామ్రాజ్యం విస్తరించడానికి, పోలీసులనూ అధికారు లనూ లెక్క చేయలేనంతగా చెలరేగిపోవడానికి అతడికి రాజకీయ అండదండలు ఉండటమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యోగి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి నేరచరిత్ర కలిగిన ఒక సంఘటనలోనే ఎనిమిది మంది పోలీసులను పొట్టనపెట్టు కున్న నరరూపరాక్షసుడు దూబే ఎన్‌కౌంటర్‌ అయినంత మాత్రాన దూబే నేరసామ్రాజ్యం అంతైమపోయినట్లు కాదు.

దూబేకు సహకరి స్తూ వచ్చిన అధికారయంత్రాంగం, పోలీసు, రాజకీయవేత్తల గుట్టు కూడా రట్టు చేయాల్సి ఉంటుంది.

దూబే దుర్మార్గం ఎంతటిదో తెలియాలంటే దూబే ఎన్‌కౌంటర్లో మరణించాడన్న వార్త విన్న అతని తల్లిదండ్రులు, భార్య, అతని స్వస్థలంలోని వారు అందరూ తగినశాస్తే జరిగిందనడమే.

అటువంటి వ్యక్తికి తెరవెనుక సహకారం అందించిన వారిని వెలుగులోకి తీసుకువచ్చి శిక్షించుకుంటే వారి ద్వారానే మరొక దూబే తయారవుతాడు

అన్నదానికి నిదర్శనంగానే దళిత మహిళపై అమానవీయకోణంలో జరిగిన రాక్షసత్వంగా హత్యాచారం,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఇటీవల ఎన్ని సంఘటనలు జరిగాయో, జరుగుతూనే ఉన్నాయో లెక్కేలేదు.

ప్రధానంగా పెత్తందారీ దురహంకార శక్తులకు బలా నిచ్చే పాలకులున్నచోట ఎలాంటి శిక్షలూ మనకు పడవనుకున్న చోట అయా శక్తులు మరింత పేట్రేగిపోవడం మనమంతా చూస్తు న్నాం.

బాధితులను రక్షించడం కోసం నేరస్తులను శిక్షించడం కోసం అంటూ తెచ్చే కొత్తచట్టాలు,శిక్షలు సామాన్యుల కంటితడి తూడ్చడా నికితప్ప వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఏమీ ఉపయోగపడ లేవనే విమర్శ ఉంది.

ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికేనన్నది పదేపదే రుజువవుతున్న కఠిన వాస్తవం.

-డా.సంగని మల్లేశ్వర్‌, (రచయిత: విభాగాధిపతి జర్నలిజం శాఖ)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/