భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు

గతంలో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు

gautam gambhir
gautam gambhir

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారని..ఫిట్‌నెస్‌ లేకపోతే ఏ ఫార్మాట్‌లోనూ రాణించలేరని భారత మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం భారత ఆటగాళ్లు మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నారు. గతంలో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ టీ20 ఫార్మాట్‌ వచ్చిన తర్వాత క్రికెట్‌ ఫిట్‌నెస్‌తో కూడిన ఆటగా మారింది.. తాను క్రికెట్‌ ఆడటం ప్రారంభించినప్పుడు టీ20 ఫార్మాట్‌ లేదు. అప్పట్లో క్రికెట్‌ అంటే ఫిట్‌నెస్‌ కంటే సాంకేతికమైన ఆటగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు ఫిట్‌నెస్‌ లేనిది ఏ ఫార్మాట్‌లోనే ఎవరూ రాణించలేరు అని తెలిపాడు. ఇంకా మహిళా జట్టు గొప్పగా ఆడుతోందని, ఇది దేశానికి శుభసూచకమని గంభీర్‌ అన్నాడు. క్రీడల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగితే భారత్‌ను క్రీడాదేశంగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతుందని తెలిపాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/