క్రెడిట్‌ అంతా మోది, షాలకే

omar abdullah
omar abdullah

హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్లే..మోది ప్రభంజనం సృష్టించారు. ఎన్డీయే కూటమికి 300 సీట్లు దాటుతాయని చెప్పిన ఎగ్జిట్‌ సర్వేలన్నీ నిజమయ్యాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ఇవాళ ట్విట్టర్‌లో స్పందించారు. ఎన్డియే కూటమిని మెచ్చుకోక తప్పడం లేదన్నారు. ప్రధాని మోది, బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షాలకు ఫుల్‌ క్రెడిట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. చాలా ప్రొఫెషనల్‌ క్యాంపెయిన్‌ చేశారని అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 288 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది, ఎన్డియే మొత్తం 340 స్థానాల్లో దూసుకెళ్తున్నది.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/