భారత రుణ వ్యవస్థ బలపడింది

బడ్జెట్‌ ప్రతిపాదనల వల్ల ద్రవ్యోల్భణం పెరగదు

shaktikanta das
shaktikanta das

న్యూఢిల్లీ: రుణాల వృద్ధి పెరుగుతూనే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (rbi ) గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేస్తున్నారు. అలాగే, బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ద్రవ్యోల్భణం పెరగదన్నారు. భారత రుణ వ్యవస్థ బలపడిందని చెప్పారు. శనివారం ఆర్బీఐ కేంద్ర బోర్డు 582వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శక్తికాంత దాస్ మాట్లాడారు. మన రుణ వ్యవస్థ బలపడిందని శక్తికాంతదాస్ అన్నారు. ప్రయివేట్ రంగానికి నిధుల కొరత రాకుండా బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పెరిగాయన్నారు. రుణాల మంజూరు పెరిగితే వినియోగదారుల వద్ద నగదు పెరుగుతుందని, దీంతో మార్కెట్లో డిమాండ్‌ ఊపందుకుని, జీడీపీ పుంజుకునే వీలు ఉందని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/