క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వినియోగదారులకు ఆర్‌బిఐ షాక్‌

ఇక మీ కార్డులపై ఈ సేవలను నిలిపివేయబడతాయి

Credit, debit cards must use online transactions
Credit, debit cards must use online transactions

న్యూఢిల్లీ: మీ వద్ద క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డు ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మార్చి 16 మీకు ఎంతో కీలకమైన తేదీ. మీరు మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌‌లను ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను ఉపయోగించకుండా ఉంటే మాత్రం మీ కార్డు పనిచేయకపోవచ్చు. అందువల్ల మీరు మీ కార్డును ఉపయోగించకుండా ఉంటే వెంటనే ఏదో ఒక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించండి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే 2020 మార్చి 16 నుంచి మీ కార్డులపై ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ఫెసిలిటీలు నిలిపివేయబడతాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ల సెక్యూరిటీని మరింత పెంచాలనే లక్ష్యంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆర్‌బిఐ జనవరి 15న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లకు ఉపయోగించని క్రెడిట్ కార్డు, డెబిట్‌ కార్డు లపై ఆ సేవలను రద్దు చేయాలని ఆర్‌బీఐ ఇప్పటికే కార్డు జారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అందువల్ల కార్డు యూజర్లు మార్చి 16లోపు ఆన్‌లైన్ లేదా కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్లను నిర్వహిస్తేనే ఆ సేవలను భవిష్యత్‌లోనూ పొందగలరు. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/