హిమాచల్‌లో ఓటింగ్ లో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలిః ప్రధాని

ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని హిమాచల్ ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి

“Create a new record of voting”, PM Modi appeals to Himachal voters

సిమ్లాః హిమాచల్​ప్రదేశ్​లోని 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకొని, రికార్డు సృష్టించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో పాల్గొనాలని, హిమాచల్ లోని ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ లో పాల్గొని కొత్త రికార్డు సృష్టించాలని దేవభూమి ఓటర్లందరినీ కోరుతున్నట్టు ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ రోజు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లకు కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేసిన రాష్ట్ర యువతకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని అదే ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాలకు శనివారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. నేడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 55.92 లక్షల మంది ఓటర్లు 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 1982 నుండి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలని బిజెపి చూస్తుండగా, కాంగ్రెస్ తన ’10 హామీల’పై విశ్వాసం పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికలలో బలమైన పనితీరును ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/