చంద్రబాబు నివాసం కూల్చివేత పనులు ప్రారంభం!


చంద్రబాబు నివాసం అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు

chandrababu
chandrababu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటున్న సీఆర్డీఏ ఈ మేరకు కూల్చివేత పనులు ప్రారంభించింది. చంద్రబాబు నివాసం ఖాళీ చేయాలంటూ మూడ్రోజుల క్రితం సీఆర్డీఏ నోటీసులు జారీచేసింది. చంద్రబాబు నివాసంలో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని సీఆర్డీఏ తన నోటీసుల్లో పేర్కొంది. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట వెంబడి ఉన్న అనేక నిర్మాణాలను సీఆర్డీఏ సిబ్బంది కూల్చివేస్తున్నారు. కాగా, చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ సీఆర్డీఏ నోటీసులపై స్పందించారు. తాము భవన నిర్మాణం చేపట్టిన సమయంలో సీఆర్డీఏ లేదని, స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అధికారుల అనుమతితోనే నిర్మించామని వివరించారు. అయితే, లింగమనేని రమేశ్ వివరణ పట్ల సంతృప్తి చెందని సీఆర్డీఏ అధికారులు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/