కంప్యూటర్‌ కోర్సులకు క్రేజ్‌

ఇంటర్మీడియట్‌ తర్వాత అనేక కోర్సులు ఉన్నప్పటికీ కంప్యూటర్‌ సంబంధిత కోర్సులకు ఉన్నంత క్రేజ్‌ మరి దేనికి ఉండదు. ఈ మధ్య ఈ క్రేజ్‌ కొంచెం తగ్గినప్పటికీ అవి ఎవర్‌ గ్రీన్‌ కోర్సులుగానే పరిగణింపబడతాయి. అయితే అసలు ఇంటర్‌ తర్వాత ఈకోర్సుల స్వభావం ఎలా ఉంటుంది. మొత్తం ఎన్ని కోర్సులు ఉంటాయి అనే విషయాలు ఒక్కసారి చూద్దాం.

Computer Course students

సాధారణ డిగ్రీ కోర్సులైన బి.కాం, బిఎస్‌సిలలో కంప్యూటర్‌ సమ్మిళిత కోర్సులు ఉంటాయి. అవే బి.కామ్‌ కంప్యూటర్స్‌, బి.ఎస్‌సి కంప్యూటర్‌. ఈ కోర్సులలో ప్రాథమిక అంశాలైన ఎం.ఎస్‌ ఆఫీస్‌తో పాటు ఏవైనా రెండు ప్రొగ్రామింగ్‌ లాంగ్వేజీలను నేర్పిస్తారు. వీటితో పాటుగా ఇంటర్నెట్‌ వాడటం లాంటి అంశాలు కూడా ఉంటాయి. మొత్తం మీద కంప్యూటర్‌ అంటే ఒక సమగ్ర అవగాహన వచ్చే విధంగా ఈ కోర్సుల స్వరూపం ఉంటుంది. అయితే ఒక విద్యార్థి తన డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఇవి మాత్రమే సరిపోవు.. వీటికి సమాంతరంగా విద్యార్థులు మరికొన్ని కంప్యూటర్‌ ఆధారిత అప్లికేషన్స్‌లను నేర్చుకోవాల్సి ఉంటుంది.

బి.కాం విద్యార్థులైతే తప్పనిసరిగా అకౌంటింగ్‌ ప్యాకేజీ, ట్యాలీ లాంటివాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. మిగతా విద్యార్థులైతే జావా, ఒరాకిల్‌ లాంటి అధునాత ప్రోగ్రాంలతో పాటు డిటిపిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సాధారణ డిగ్రీ విద్యార్థులు కూడా బహుళ జాతి కంపెనీల్లో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలను పొందగలరు.

ఆ తర్వాత కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లు ఎక్కువగా ఉండే కోర్సు ఇంజనీరింగ్‌. ఇంజనీరింగ్‌ నందలి దాదాపు అన్ని బ్రాంచిలలో కంప్యూటర్‌ యొక్క ఉపయోగం బాగా ఉన్నప్పటికీ కొన్ని కోర్సులలో మాత్రం కంప్యూటర్‌ పూర్తిగా ఇమిడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఇ.సి.ఇ (ఎలక్ట్రికల్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌) , ఐ.టి (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), సిఎస్‌ఇ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌). ఈ కోర్సులలో అన్ని రకాల అప్లికేషన్స్‌లతో పాటు హార్డ్‌వేర్‌ను కూడా నేర్పిస్తారు.

ఇక్కడ కూడా విద్యార్థిని కంప్యూటర్‌ రంగంలో రాటు తేలే విధంగా సిలబస్‌ ఉంటుంది. అయితే దురదృష్టవశాత్తూ మన విద్యార్థుల్లో 90శాతం మంది ఈనైపుణ్యాలేవీ నేర్చుకోకుండానే బయిటకు వస్తున్నారు. ఒకవేళ నేర్చుకున్నా ఇవి మంచి ఉద్యోగం సంపాదించడానికి సరిపోవడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నప్పటికీ విద్యార్థి పాత్ర కూడా కొంత ఉం టుంది. అందుకే విద్యార్థి వీటికి సమాంతరంగా మరికొన్ని అధు నాతన కంప్యూటర్‌ ప్రోగ్రాంలను నేర్చుకున్నట్లయితే మంచి వేత నంతో కూడిన ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/