కియా పరిశ్రమ తరలింపుపై స్పష్టతనివ్వాలి

కియాపై 13 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు

k ramakrishna
k ramakrishna

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కియా పరిశ్రమ తరలింపుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కియాపై 13వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని, 30 వేల కార్లు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. వేలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మరో రూ.2వేల కోట్ల పెట్టుబడితో అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో కియా తరలిపోతుందనే ప్రచారం..స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/